ఓ వాణిజ్య ప్రకటన సోనియా, రాహుల్ లను కించపరిచేలా ఉందంటూ కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం

  • యాడ్ వీడియో రూపొందించిన స్టోరియా ఫుడ్స్
  • సోనియా, రాహుల్ లను పోలిన పాత్రలతో యాడ్
  • అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు
  • స్టోరియా ఫుడ్స్ కార్యాలయం ఎదుట ధర్నా
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీలను కించపరిచే రీతిలో ఓ వాణిజ్య ప్రకటన రూపొందించారంటూ ముంబయిలోని స్టోరియా ఫుడ్స్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టాయి. స్టోరియా ఫుడ్స్ ఆ యాడ్ లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ లను పోలిన పాత్రలతో తమ ఉత్పత్తులకు ప్రచారం చేసుకుందని హస్తం పార్టీ నేతలు మండిపడుతున్నారు.

ఆ యాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు స్టోరియా ఫుడ్స్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఆ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. కాగా, ఈ వివాదంపై స్టోరియా ఫుడ్స్ ఇంకా స్పందించలేదు.


More Telugu News