విశాఖలో విషాదం.... ఏడాది చిన్నారి కరోనాకు బలి
- వీరబాబు కుమార్తె జ్ఞానితకు కరోనా
- ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
- కోలుకోని పాప
- కేజీహెచ్ కు అంబులెన్స్ లో తరలింపు
- అంబులెన్స్ లోనే విలువైన సమయం వృథా
విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. కరోనా బారినపడిన ఏడాది చిన్నారి బాధాకరమైన పరిస్థితుల నడుమ ప్రాణాలు విడిచింది. విశాఖ జిల్లాలోని అచ్యుతాపురం మండలం చౌడుపల్లి గ్రామానికి చెందిన వీరబాబు కుమార్తె జ్ఞానిత నాలుగు రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతోంది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా లక్షల్లో ఖర్చయింది గానీ, పాప కోలుకోలేదు. దాంతో కరోనా పరీక్షలు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత జ్ఞానితను తల్లిదండ్రులు మరో కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారు ఆ చిన్నారిని కేజీహెచ్ కు తీసుకెళ్లాలని సూచించగా, అంబులెన్స్ లో అక్కడికి చేరుకున్నారు.
అయితే, పాపను ఆసుపత్రిలో చేర్చుకునే క్రమంలో చాలాసేపు అంబులెన్స్ లో సమయం వృథా అయింది. ఇంతలో అడ్మిషన్ వచ్చినా, అప్పటికే పాప ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ చిన్నారి ఇక లేదని తెలిసి ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం.