మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్!

  • మూఢ నమ్మకాలతో కన్నకూతుర్లను హతమార్చిన దంపతులు
  • జనవరి 24న జరిగిన జంట హత్యలు
  • కేసు నమోదై 90 రోజులు పూర్తి కావడంతో బెయిల్ మంజూరు
చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. జనవరి 24న ఈ హత్యలు జరిగాయి. మూఢ నమ్మకాలతో తమ ఇద్దరు కన్నకూతుర్లను వారి తల్లిదండ్రులే హతమార్చారు. ఈ దారుణానికి ఒడిగట్టిన పద్మజ, పురుషోత్తంలు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వీరిద్దరికీ మదనపల్లె న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

ఈ దంపతులిద్దరూ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వీరికి తొలుత తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో, ఆ తర్వాత విశాఖలోని మానసిక వైద్యశాలలో చికిత్స అందించారు. అనంతరం మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. వీరిపై కేసు నమోదై 90 రోజులు పూర్తి కావడంతో.. కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

మరోవైపు, హత్యకు పాల్పడిన ఇద్దరూ ఉన్నత విద్యలను అభ్యసించి, ఉన్నతోద్యోగాలను చేస్తున్నవారే కావడం గమనార్హం.


More Telugu News