కరోనా ఎఫెక్ట్.. హైదరాబాదులో సేవలను రద్దు చేస్తున్న యూఎస్ కాన్సులేట్ జనరల్!

  • మే 3 నుంచి సాధారణ వీసా సేవలు రద్దు
  • సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు సేవలు బంద్
  • అత్యవసర అపాయింట్ మెంట్లను కొనసాగించేందుకు యత్నిస్తామని ప్రకటన
తెలంగాణలో కూడా కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కీలక నిర్ణయం తీసుకుంది. వీసా రెన్యువల్స్, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూలు సహా అన్ని సాధారణ వీసా సేవలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మే 3వ తేదీ నుంచి ఈ సేవలను తాత్కాలికంగా ఆపేస్తున్నామని తెలిపింది. తదుపరి ప్రకటన వెలువడేంత వరకు ఇది అమల్లో ఉంటుందని చెప్పింది.

సాధారణ అమెరికన్ సిటిజన్ సర్వీసెస్ ఈరోజు నుంచే రద్దయ్యాయి. స్థానిక పరిస్థితులు అనుకూలించేంత వరకు సేవలను రద్దు చేస్తున్నట్టు కాన్సులేట్ జనరల్ చెప్పింది. ఇప్పటికే షెడ్యూల్ చేసిన అత్యవసర అపాయింట్ మెంట్లను కొనసాగించేందుకు యత్నిస్తామని తెలిపింది.


More Telugu News