ఖమ్మం అంటే కేసీఆర్ కు వివక్ష... ఒక్క సీటుకే పరిమితం చేశారని కోపం: కిషన్ రెడ్డి
- తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం
- అధికార పక్షంపై కిషన్ రెడ్డి విమర్శలు
- అధికార దుర్వినియోగంతో గెలవాలని చూస్తున్నారని ఆరోపణ
- ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కు ప్రజాబలంలేదని వెల్లడి
- ఫిరాయింపులతో సీట్ల బలం పెంచుకున్నారని వ్యాఖ్యలు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి తెలంగాణ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. బెదిరింపులు, అధికార దుర్వినియోగంతో టీఆర్ఎస్ గెలవాలని చూస్తోందని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో ఫిరాయింపులతో కేసీఆర్ సీట్ల బలం పెంచుకుంది తప్ప ప్రజాబలం కాదని స్పష్టం చేశారు.
ఖమ్మం అంటే కేసీఆర్ కు వివక్ష అని, ఒక్క సీటుకే పరిమితం చేశారని కోపమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలన కాంట్రాక్టర్లు, లిక్కర్, ఇసుక మాఫియాలకు అడ్డాగా మారిందని కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరుగుతున్న తీరు చూస్తే నత్త కూడా సిగ్గుపడుతుందని అన్నారు.