మురళీ మోహన్ జయభేరి కన్ స్ట్రక్షన్స్ కు ఏపీ సర్కారు భారీ జరిమానా

  • అమరావతి సమీపంలో జయభేరి నిర్మాణాలు
  • కుంచనపల్లిలో 7 ఎకరాల 5 సెంట్ల స్థలం కొనుగోలు
  • 2016లో నిర్మాణాలు
  • వ్యవసాయభూమిని కమర్షియల్ ల్యాండ్ గా మార్చలేదన్న ప్రభుత్వం
  • రూ.1 కోటి జరిమానా
  • రూ.50 లక్షల అపరాధ రుసుం
ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ కు చెందిన జయభేరి కన్ స్ట్రక్షన్స్ కు అధికారులు భారీ జరిమానా వడ్డించారు. అమరావతిని ఆనుకుని ఉండే కుంచనపల్లిలో జయభేరి కన్ స్ట్రక్షన్స్ నిర్మించిన భవనాలు నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్న అధికారులు రూ.1.5 కోట్లు జరిమానాగా విధించారు.

జాతీయ రహదారి పక్కనే ఉండే కుంచనపల్లిలో 7 ఎకరాల 5 సెంట్ల భూమిని కొనుగోలు చేసిన జయభేరి కన్ స్ట్రక్షన్స్ 2016లో నిర్మాణాలు చేపట్టింది. అయితే, ఇది వ్యవసాయ భూమి కాగా దీంట్లోనే నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో నిబంధనలు పాటించలేదని జయభేరి కన్ స్ట్రక్షన్స్ పై ప్రస్తుత ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

రంగంలోకి దిగిన అధికారులు 3 శాతం ల్యాండ్ కన్వర్షన్ ఫీజుతో పాటు జరిమానా కూడా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినందుకు రూ.1 కోటి, అపరాధ రుసుం కింద మరో రూ.50 లక్షలు చెల్లించాలని జయభేరి కన్ స్ట్రక్షన్స్ ను ఆదేశించారు. ఈ జరిమానాను జయభేరి సంస్థ చెల్లించినట్టు తెలుస్తోంది.


More Telugu News