ఏపీ వైద్య మంత్రి ఎవరు?: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- కరోనా రోగులకు కనీస రక్షణ కూడా కల్పించలేని స్థితిలో ఉన్నారు
- సమీక్షలు తప్ప సీఎం చేసిందేమీ లేదు
- ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలి
కరోనా రోగులకు చికిత్స అందించడంపై ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. రోగులకు కనీస రక్షణ కూడా కల్పించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. సమీక్షలను నిర్వహించడం మినహా ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి చర్యలను తీసుకోవడం లేదని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో ఆరోగ్యశాఖ మంత్రి ఎవరని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయని చెప్పారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. కరోనా పేషెంట్లకు కనీసం ఆక్సిజన్, బెడ్లను కూడా కల్పించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలని... ప్రజారోగ్యంపై దృష్టిని సారించాలని సూచించారు.