ప్రధాని మోదీ ప్రభుత్వం ఈ విషయాన్ని గ్రహించాలి: రాహుల్ గాంధీ
- పోరాటం కొవిడ్ పై మాత్రమే
- అంతేగానీ, కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలతో కాదు
- రాజకీయపర ఒప్పందం అవసరమని సోనియా వ్యాఖ్యలను ట్వీట్ చేసిన రాహుల్
దేశంలో కరోనా విజృంభిస్తోన్న వేళ పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతోన్న నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనాపై పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, దీనిపై రాజకీయపర ఒప్పందం అవసరమని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వానికి సూచించిన ఓ వార్తను రాహుల్ పోస్ట్ చేశారు.
'ప్రధాని మోదీ ప్రభుత్వం ఒక విషయాన్ని గ్రహించాలి.. ప్రస్తుతం పోరాటం కొవిడ్ పై మాత్రమే.. అంతేగానీ, కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలతో కాదు' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాగా, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని రాహుల్ కొన్ని రోజులుగా విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. రోగులకు సాయం అందించేందుకు కృషి చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించింది.