ఆసుపత్రిలో తీవ్రమైన ఒత్తిడి, పనిభారం వల్ల గొడవ.. డాక్టర్‌ని కొట్టిన నర్సు.. వీడియో వైరల్
- ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా ఆసుపత్రిలో ఈ ఘటన
- నర్సు తనని కొట్టడంతో తిరిగి కొట్టిన డాక్టర్
- ఘటనపై విచారణకు ఆదేశం
ఓ డాక్టర్‌ను నర్సు చెంపపై కొట్టింది.. దీంతో ఆ డాక్టర్ కూడా ఆమెను కొట్టాడు.. పరస్పరం దూషించుకుంటూ వారు ఆసుపత్రిలోనే అందరి ముందూ గొడవ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు లభ్యమైంది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనపై నగర మెజిస్ట్రేట్ రాంజీ మిశ్రా మీడియాకు వివరాలు తెలిపారు. తాను డాక్టరు, నర్సుతో మాట్లాడానని, వారిద్దరూ తీవ్రమైన ఒత్తిడి, అధిక పనిభారం వల్లే ఇలా చేసినట్లు చెప్పారని వివరించారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని తెలిపారు. కాగా, ఆసుపత్రిలో వైద్యుడికి వద్దకు నర్సు వచ్చి ఓ విషయంపై ప్రశ్నించగా ఆయన అందుకు సరిగ్గా స్పందించకుండా వాగ్వివాదానికి దిగినట్లు వీడియో ద్వారా అర్థమవుతోంది.
ఈ నేపథ్యంలో గొడవ పెరిగి అసభ్య పదజాలంతో ఇరువురూ దూషించుకున్నారు. అక్కడున్న వారు వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. ఓ రోగికి సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రం జారీ అంశమై వారు గొడవపడ్డట్టు సమాచారం.