క‌రోనా వేళ యూకే నుంచి భార‌త్‌కు పెద్ద ఎత్తున సాయం.. వీడియో ఇదిగో

  • వైద్య ప‌రిక‌రాలు, ఔష‌ధాలు, ఆక్సిజ‌న్ పంపిన యూకే
  • ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న వైద్య‌ సామ‌గ్రి
  • త్వ‌ర‌లోనే యూకే నుంచి మ‌రింత సాయం
భార‌త్‌లో క‌రోనా క‌రాళ‌నృత్యం చేస్తోన్న‌ వేళ ప‌లు దేశాలు సాయం చేస్తున్నాయి. వైద్య ప‌రిక‌రాలు, ఔష‌ధాలు, ఆక్సిజ‌న్ వంటి వాటిని పంపుతున్నాయి. నిన్న‌ భార‌త్‌కు అమెరికా ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేటర్స్‌ను పంపిన విష‌యం తెలిసిందే. భార‌త్‌కు సాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించిన యూకే కూడా పెద్ద ఎత్తున‌ వైద్య ప‌రిక‌రాలు, ఔష‌ధాల‌ను పంపింది.

వాటిల్లో 100 వెంటిలేట‌ర్లు, 95 ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేటర్స్ కూడా ఉన్నాయి. నిన్న యూకే నుంచి ఆయా ప‌రిక‌రాల‌తో బ‌య‌లుదేరిన విమానం ఈ రోజు ఉద‌యం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. వాటిని విమానం నుంచి సంబంధిత సిబ్బంది దించి నిల్వ చేసే చోటుకి త‌ర‌లించారు. కాగా, త్వ‌ర‌లోనే యూకే నుంచి మ‌రిన్ని వైద్య ప‌రిక‌రాలు, ఔష‌ధాలు భార‌త్‌కు చేరుకోనున్నాయి.


More Telugu News