ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ యజమాని ఔదార్యం.. సొంత డబ్బుతో 400 టన్నుల ఆక్సిజన్ సరఫరా

  • మహారాష్ట్రలో కరోనా విలయం
  • ఆక్సిజన్ అందక చనిపోతున్న రోగులు
  • రూ. 85 లక్షలతో 400 టన్నుల ఆక్సిజన్ సరఫరా
సరిపడా ఆక్సిజన్ అందక ఆసుపత్రుల్లో చేరిన కరోనా రోగులు మరణిస్తున్న వేళ ఓ వ్యాపారవేత్త ఔదార్యం చాటుకున్నాడు. సొంత ఖర్చుతో ఏకంగా 400 టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను కొనుగోలు చేసి పలు ఆసుపత్రులకు అందించి ఎంతో మంది ప్రాణాలు నిలిపాడు. మహారాష్టలోని నాగ్‌పూర్‌కు చెందిన ప్యార్‌‌ఖాన్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ యజమాని. ఆక్సిజన్ సరఫరా లేక నాగ్‌పూర్ జిల్లాలో వైద్య వ్యవస్థ కుప్పకూలడంతో స్పందించిన ఆయన వెంటనే తన సొంత డబ్బుతో 400 టన్నుల ఆక్సిజన్‌ను కొనుగోలు చేశాడు. దానిని నాగ్‌పూర్ మునిసిపల్ కార్పొరేషన్, నాగ్‌పూర్ జిల్లా పరిధిలోని పలు ఆసుపత్రులకు సరఫరా చేశాడు. ఇందుకోసం ఏకంగా రూ. 85 లక్షలు ఖర్చు చేశాడు.

ఆక్సిజన్ కొనుగోలుకు పెద్దమొత్తంలో డబ్బులు ఖర్చు చేయడంపై ప్యార్‌ఖాన్ మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో చేసిన ఈ పని తనకెంతో సంతృప్తినిచ్చిందన్నాడు. కాగా, 2007లో ట్రాన్స్‌పోర్టు కంపెనీని స్థాపించకముందు ప్యార్‌ఖాన్ రైల్వే స్టేషన్‌ వద్ద నారింజకాయలు అమ్మేవాడు. ఆ తర్వాత కొంతకాలం ఆటో కూడా నడిపాడు.


More Telugu News