ప్రభుత్వాన్ని నిందిస్తున్న వారికి బాంబే హైకోర్టు ఘాటు హెచ్చరిక

  • మహారాష్ట్రలో పెరుగుతున్న కొవిడ్ కేసులు
  • పౌరులుగా కాస్తంత స్పృహతో వ్యవహరించాలన్న ధర్మాసనం
  • ప్రతి ఒక్కరు కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలని ఆదేశం
మహారాష్ట్రలో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని నిందించడం మాని కరోనా మార్గదర్శకాలు పాటించాలని బాంబే హైకోర్టు పౌరులకు సూచించింది. ప్రభుత్వాన్ని నిందించడానికి ముందు పౌరులుగా మనం మన ప్రాంతం, పరిస్థితులపై కాస్తంత స్పృహతో వ్యవహరించాలని జస్టిస్  రవీంద్ర ఘగే, జస్టిస్ బీయూ దేవాద్వర్‌లతో కూడిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ వ్యాఖ్యానించింది.

ఈ మేరకు పలు ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో లేని ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బందితోపాటు పౌరులందరూ మాస్కులు ధరించాలని, ఇంటి నుంచి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని సూచించింది. ప్రభుత్వాన్ని నిందించడానికి ముందు పౌరులందరూ కొవిడ్ నిబంధనలు, మార్గదర్శకాలను పాటించాలని కోర్టు స్పష్టం చేసింది.


More Telugu News