కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ కరోనాతో కన్నుమూత
- కరోనాతో ఆదివారం ఆసుపత్రిలో చేరిన ఎమ్మెస్సార్
- వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా మెరుగుపడని ఆరోగ్యం
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన ఎమ్మెస్సార్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎమ్మెస్సార్ (ఎం.సత్యనారాయణరావు) కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. కరోనాతో నిమ్స్‌లో చేరిన ఆయన అక్కడ చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 3.45 గంటలకు తుదిశ్వాస విడిచారు.
ఎమ్మెస్సార్‌కు కొవిడ్ సోకడంతో కుటుంబ సభ్యులు ఆదివారం ఆయనను నిమ్స్‌లో చేర్చారు. అక్కడాయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడమే కాకుండా మరింత క్షీణించింది. దీంతో ఈ తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెస్సార్ ఆర్టీసీ చైర్మన్‌గా, దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు.