ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల అస్ట్రాజెనికా టీకా డోస్ లను పంచనున్నాం: వైట్ హౌస్

  • అందుబాటులోకి రాగానే పంపిణీ మొదలు
  • ముందుగా ఫెడరల్ సేఫ్టీ రివ్యూ జరుగుతుంది
  • వెల్లడించిన వైట్ హౌస్ సలహాదారు ఆండీ సాల్విట్
ఆస్ట్రాజెనికా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను ప్రపంచ దేశాలకు అందించనున్నామని యూఎస్ వైట్ హౌస్ సీనియర్ కొవిడ్-19 సలహాదారు ఆండీ సాల్విట్ వెల్లడించారు. మొత్తం 60 మిలియన్ (6 కోట్లు) డోస్ లను ఎగుమతి చేస్తామని ఆయన అన్నారు. టీకాలు అందుబాటులోకి రాగానే పంపిణీ మొదలవుతుందని ఆయన స్పష్టం చేశారు.

కాగా, ఫెడరల్ సేఫ్టీ రివ్యూ తరువాత ఈ ఎగుమతులు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. గడచిన మార్చిలో అమెరికా నుంచి 40 లక్షల టీకా డోస్ లు కెనడా, మెక్సికో దేశాలకు అందాయన్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవలి కాలంలో ఇండియా సహా పలు దేశాల్లో కేసుల సంఖ్య పెరిగిపోతున్న వేళ, బైడెన్ సర్కారుపై వ్యాక్సిన్ సరఫరా చేయాలంటూ ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే శ్వేతసౌధం నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.


More Telugu News