టెక్ మహీంద్రా నాలుగో త్రైమాసికం లాభాల్లో 34 శాతం వృద్ధి
- మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.1,081 కోట్ల లాభాలు
- మూడో త్రైమాసికంతో పోలిస్తే లాభాల్లో 17.4 శాతం క్షీణత
- మార్చి త్రైమాసికంలో రూ.9,730 కోట్ల ఆదాయం
- ఒక్కో షేరుకు రూ.30 డివిడెండు ప్రతిపాదన
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన టెక్ మహీంద్రా మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం సమీకృత నికర లాభాలు 34 శాతం వృద్ధి చెంది రూ.1081 కోట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.804 కోట్లుగా రికార్డయింది. అయితే డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంతో పోలిస్తే మాత్రం లాభాలు 17.4 శాతం క్షీణించాయి. మూడో త్రైమాసికంలో కంపెనీ రూ.1,310 కోట్ల లాభాలను ఆర్జించింది.
2020తో పోలిస్తే మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 2.5 శాతం వృద్ధి చెంది రూ.9,730 కోట్లుగా నమోదైంది. ఇక బోర్డు ఒక్కో షేరుకు రూ.15 ప్రత్యేక డివిడెండుతో పాటు మొత్తం రూ.30 డివిడెండ్ ఇవ్వాలని ప్రతిపాదించింది. ఆగస్టు 11 నాటికి దీన్ని వాటాదారులకు చెల్లించాలని నిర్ణయించింది.