భారత మార్కెట్లోకి థర్డ్ జనరేషన్ హయబూసా బైక్... ధర రూ.16.40 లక్షలు!

  • స్పోర్ట్స్ బైక్ లలో హయబూసాకు విశిష్ట గుర్తింపు
  • థర్డ్ జనరేషన్ హయబూసాను తీసుకువచ్చిన సుజుకి
  • బీఎస్6 ప్రమాణాలతో బ్రాండ్ న్యూ బైక్
  • స్టన్నింగ్ లుక్స్ తో అలరారుతున్న జపనీస్ బైక్
జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకి రూపొందించే బైకులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్పోర్టీ లుక్ తో వాయువేగంతో దూసుకెళ్లే బైకులు తయారు చేసే సుజుకి తన సూపర్ బ్రాండ్ హయబూసా బైక్ ను మరింత ఆధునికీకరించింది. తాజాగా థర్డ్ జనరేషన్ హయబూసాను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బ్రాండ్ న్యూ హయబూసా బైక్ ధర రూ.16.40 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూం). 'అల్టిమేట్ స్పోర్ట్' అంటూ తమ కొత్త బైక్ తీరుతెన్నులను సుజుకి ఒక్క ముక్కలో చెప్పేసింది.

బైక్ డిజైన్ చూస్తే యువత కిర్రెక్కిపోవడం ఖాయం అనేలా ఉంది. యూనిక్ స్టయిలింగ్, అద్భుతమైన ఏరోడైనమిక్స్ సమ్మిళితమైన హయబూసా థర్డ్ జనరేషన్ బైక్ సర్వోత్తమ రైడింగ్ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి డిజిటల్ యుగానికి తగ్గట్టుగా సుజుకి ఇంటలిజెంట్ రైడ్ సిస్టమ్ (ఎస్ఐఆర్ఎస్)ను ఈ బైక్ లో పొందుపరిచారు.

రైడర్లు తమ అవసరాలకు తగినట్టుగా పలు మోడ్ లు ఎంచుకునే సౌలభ్యం ఉంటుంది. ఇంజిన్ విషయానికొస్తే... హయబూసా థర్డ్ జనరేషన్ బైక్ లో 1340 సీసీ ఫోర్ స్ట్రోక్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఏర్పాటు చేశారు.

సుజుకి మేనేజింగ్ డైరెక్టర్ కోయిచిరో హిరావో మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్ బైక్ ప్రేమికులు మెచ్చే విధంగా హయబూసా గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతోందని, ఇప్పుడు బీఎస్6 ప్రమాణాలతో తీసుకువచ్చిన కొత్త బైక్ కూడా అందరి హృదయాలను దోచుకుంటుందని పేర్కొన్నారు.


More Telugu News