ఈసీపై మద్రాస్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. స్వాగతించిన మమతా బెనర్జీ

  • కరోనా వ్యాప్తికి ఈసీనే కారణమన్న మద్రాస్ హైకోర్టు
  • సరైన చర్యలు తీసుకోకపోతే కౌంటింగ్ ఆపేస్తామని హెచ్చరిక
  • హైకోర్టు ఆరోపణల నుంచి ఈసీ తప్పించుకోలేదన్న మమత
కరోనా సెకండ్ వేవ్ సమయంలో వైరస్ వ్యాప్తికి ఈసీనే కారణమని మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ఎన్నికల ర్యాలీలను అనుమతించి కరోనా వ్యాప్తికి కారణమయ్యారని మండిపడింది. మీ అధికారులపై హత్య కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. సరైన చర్యలను తీసుకోకపోతే తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ను ఆపేస్తామని హెచ్చరించింది.

మరోవైపు మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. సెకండ్ వేవ్ లో కరోనా విస్తరణకు ఈసీనే కారణమని ఆరోపించారు. దీన్నుంచి ఈసీ తప్పించుకోలేదని అన్నారు. మరోవైపు బెంగాల్ లో ఈరోజు ఏడో విడత పోలింగ్ జరిగింది. ఈనెల 29న చివరి విడత పోలింగ్ జరగనుంది. మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.


More Telugu News