ముఖ్యమంత్రి అంటే జగన్ లా ఉండాలి: కోమటిరెడ్డి ప్రశంస

  • వెయ్యి దాటే అన్ని వైద్యాలను ఆరోగ్యశ్రీ కిందకు జగన్ తెచ్చారు
  • కరోనా చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు
  • ఆ పని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తెలంగాణ కాంగ్రెస్ నేత, లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి అంటే జగన్ మాదిరి ఉండాలని ఆయన అన్నారు. వెయ్యి రూపాయలు దాటే అన్ని వైద్యాలను ఆరోగ్యశ్రీలో జగన్ చేర్చారని...  కరోనా చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చారని కొనియాడారు.

తెలంగాణలో కరోనా బారిన పడిన ఎందరో పేషెంట్లు ప్రైవేటు ఆసుపత్రుకు లక్షలు చెల్లిస్తున్నారని... కరోనాను ఆరోగ్యశ్రీ కిందకు తెలంగాణ ప్రభుత్వ ఎందుకు తీసుకురాలేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. నకిరేకల్ మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాటల మధ్యలో జగన్ ప్రస్తావనను తీసుకొచ్చి, ఆయనపై ప్రశంసలు కురిపించడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించింది.


More Telugu News