ఐపీఎల్ లో ఆడుతున్న ఆటగాళ్లు ఎవరైనా వెళ్లిపోవాలనుకుంటే మాకు అభ్యంతరం లేదు: బీసీసీఐ
- కరోనా నేపథ్యంలో ఒత్తిడికి గురవుతున్న ఆటగాళ్లు
- కుటుంబీకులకు కరోనా సోకడంతో అర్ధాంతరంగా వైదొలగిన అశ్విన్
- ఆటగాళ్ల అభిప్రాయాలను గౌరవిస్తామన్న బీసీసీఐ
దేశంలో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్న తరుణంలో ఐపీఎల్ లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు భారత ఆటగాళ్లు కూడా తమ కుటుంబీకులు కరోనా బారిన పడుతుండటంతో ఒత్తిడికి గురవుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్ కూడా ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా వెదొలిగాడు.
ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఆటగాళ్లు ఎవరైనా ఐపీఎల్ టోర్నీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్ల అభిప్రాయాలకు గౌరవమిస్తామని తెలిపింది.
ఇప్పటి వరకు ఈ సీజన్ ఐపీఎల్ ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగిందని బీసీసీఐ బోర్డు సభ్యుడు ఒకరు తెలిపారు. ఎవరైనా వెళ్లిపోవాలనుకుంటే... అది వారు తీసుకున్న మంచి నిర్ణయంగానే భావిస్తామని చెప్పారు.