కర్ణాటకలోనూ లాక్ డౌన్... రేపటి నుంచి అమలు
- కర్ణాటకలో కరోనా విలయం
- బెంగళూరులో పాజిటివ్ కేసుల సునామీ
- ఆదివారం నాడు 20 వేలకు పైగా కొత్త కేసులు
- లాక్ డౌన్ విధిస్తున్నట్టు కర్ణాటక సీఎం ప్రకటన
దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ మహోగ్రరూపం దాల్చిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. తాజాగా కర్ణాటకలోనూ లాక్ డౌన్ ప్రకటించారు. 14 రోజుల పాటు కొనసాగనున్న ఈ లాక్ డౌన్ రేపు (ఏప్రిల్ 27) సాయంత్రం నుంచి అమల్లోకి రానుంది. కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే మినహాయింపునిచ్చారు.
గత కొన్నిరోజులుగా కర్ణాటకలో కొవిడ్ కేసుల సంఖ్య ఆందోళనకర రీతిలో నమోదవుతోంది. టెక్నాలజీ హబ్ గా పేరుగాంచిన బెంగళూరు నగరంలోనూ కరోనా స్వైరవిహారం చేస్తోంది. ఒక్క ఆదివారం నాడే బెంగళూరులో 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు వెల్లడి కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. దేశ రాజధాని ఢిల్లీ తర్వాత ఒక్కరోజులో ఇన్ని కేసులు వచ్చిన నగరం బెంగళూరే. కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉండడంతో ఆరోగ్య శాఖపై ఒత్తిడి మరింత అధికమవుతోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదని ముఖ్యమంత్రి యెడియూరప్ప ప్రకటించారు.