కరోనా రోగులకు చికిత్స పూర్తైనా డిశ్చార్జ్ చేయని ఆసుపత్రులకు ఏపీ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నోటీసులు

  • చికిత్స పూర్తైనా 10 నుంచి 14 రోజులు ఉంచుకుంటున్న ఆసుపత్రులు
  • ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అందిన పలు ఫిర్యాదులు
  • చికిత్స పూర్తైన వారిని వెంటనే డిశ్చార్జ్ చేయాలని ఆదేశాలు
ఏపీ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ లో భాగస్వాములైన కొన్ని ఆసుపత్రులు కాసులకు కక్కుర్తి పడుతున్నాయి. కరోనా పేషెంట్లకు చికిత్స పూర్తైనా వారిని డిశ్చార్జ్ చేయకుండా, ఆసుపత్రుల్లోనే ఉంచుకుంటూ బిల్లులను తయారు చేస్తున్నాయి. ఈ అంశంపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ దృష్టి సారించింది. సదరు ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసింది. చికిత్స పూర్తైన తర్వాత కూడా... 10 నుంచి 14 రోజులు ఆసుపత్రుల్లోనే ఉంచుకుంటున్నారంటూ అందిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో నోటీసులు ఇచ్చింది.

వాస్తవానికి రోజు వారీ ట్రీట్మెంట్ విధానంలో ఆసుపత్రులకు చెల్లింపులు జరపాల్సిందిగా ఆరోగ్యశ్రీ టెక్నికల్ కమిటీ సిఫారసు చేసింది. ఈ విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు. అయితే, కొన్ని ఆసుపత్రులు అక్రమాలకు పాల్పడుతున్నట్టు  ఫిర్యాదులు అందడంతో... ఆరోగ్యశ్రీ చర్యలకు ఉపక్రమించింది. కరోనా నుంచి కోలుకున్న రోగులను తక్షణమే డిశ్చార్జ్ చేయాలని నోటీసుల్లో ఆదేశించింది.


More Telugu News