అమెరికా నుంచి భారత్ చేరుకున్న 318 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు
- నిన్న అమెరికా నుంచి పంపిన అధికారులు
- ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు
- ఎయిర్ ఇండియా ద్వారా ఢిల్లీకి చేరుకున్న పరికరాలు
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చిన వేళ వైద్య పరికరాలు సాయం చేస్తామని ప్రకటించిన అమెరికా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. భారత్‌కు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్‌ను పంపింది. ఆక్సిజన్ అవసరం ఉన్న రోగుల కోసం ఉపయోగించే ఈ పరికరాలను అమెరికా ప్రభుత్వం నిన్న న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఎయిర్ పోర్టు నుంచి ఎయిర్ ఇండియా ద్వారా ఢిల్లీకి పంపింది.
ఈ రోజు ఈ పరికరాలు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకి చేరుకున్నాయి. మొత్తం 318 పరికరాలను భారత్‌కు అమెరికా పంపింది. వాటిని విమానం నుంచి సంబంధిత సిబ్బంది దించి, అవసరం ఉన్న ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
ఈ రోజు ఈ పరికరాలు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకి చేరుకున్నాయి. మొత్తం 318 పరికరాలను భారత్‌కు అమెరికా పంపింది. వాటిని విమానం నుంచి సంబంధిత సిబ్బంది దించి, అవసరం ఉన్న ఆసుపత్రులకు తరలిస్తున్నారు.