బెంగాల్‌లో పోలింగ్ ఏజెంట్ టోపీపై సీఎం మమత బొమ్మ
- కొనసాగుతోన్న ఏడో దశ పోలింగ్
- టీఎంసీ ఏజెంట్‌ను పట్టుకున్న బీజేపీ నేత
- అప్పటి వరకు అధికారులు గుర్తించని వైనం
పశ్చిమ బెంగాల్ లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద కలకలం చెలరేగింది. ఈ రోజు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏడో విడత పోలింగ్ జరుగుతోన్న నేపథ్యంలో అసన్‌సోల్ దక్షిణ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద మమతా బెనర్జీ ఫొటో ఉన్న టోపీ పెట్టుకుని ఓ టీఎంసీ ఏజెంట్ తిరిగాడు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా అతడు పాల్పడ్డ చర్యను అక్కడి ఎన్నికల అధికారులు ముందుగా గుర్తించకపోవడం గమనార్హం. చివరకు ఈ విషయాన్ని బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పౌల్ తన అనుచరుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు.
టోపీ ధరించిన ఏజెంట్‌ను పట్టుకున్నారు. అతడు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినప్పటికీ ఏం చేస్తున్నారని ఎన్నికల సిబ్బందిని నిలదీశారు. తనకు అనారోగ్యంగా ఉండటంతో ఈ విషయాన్ని గుర్తించలేకపోయానని ప్రిసైడింగ్ అధికారి చెప్పడం గమనార్హం. అనంతరం ఆ ఏజెంట్‌పై చర్యలు తీసుకున్నారు.