క‌రోనా వేళ కామారెడ్డిలో హృదయ విదారక ఘ‌ట‌న‌.. భార్య‌ మృతదేహంతో భర్త భిక్షాటన

  • భార్య మృత‌దేహాన్ని భుజాల‌పై వేసుకుని శ్మ‌శానానికి వెళ్లిన భ‌ర్త‌
  • మూడున్న‌ర కిలోమీట‌ర్లు అలాగే వెళ్లిన వైనం
  • క‌రోనా భ‌యంతో మృత‌దేహం వద్ద‌కు రాని స్థానికులు
క‌రోనా వేళ మ‌నుషుల్లో మాన‌వ‌త్వం మంట క‌లిసిపోతోంది. తాజాగా కామారెడ్డిలో హృదయ విదారక ఘ‌ట‌న చోటు చేసుకుంది. భార్య‌ మృతదేహంతో భర్త భిక్షాటన చేయాల్సి వ‌చ్చింది.  వివ‌రాల్లోకి వెళ్తే... కామారెడ్డి రైల్వే స్టేషన్ ప‌రిస‌రాల్లో భిక్షాటన చేసే నాగలక్ష్మి అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది.

క‌రోనా విజృంభిస్తోన్న స‌మ‌యంలో ఆమెకు కూడా క‌రోనా సోకి మృతి చెందిందేమోన‌ని స్థానికులు భావించారు. ఆమె మృతదేహం వద్దకు వచ్చేందుకు భ‌య‌ప‌డ్డారు. అంతేకాదు, ఆటోలో ఆమె మృత‌దేహాన్ని శ్మ‌శాన వాటిక వద్దకు తరలించాల‌ని మృతురాలి భ‌ర్త స్వామి భావించాడు. అయితే, అందుకు ఆటోడ్రైవర్ కూడా ఒప్పుకోలేదు.

చివ‌ర‌కు అత‌డికి రైల్వే పోలీసులు, స్థానికులు రూ.2,500 విరాళాలు సేకరించి ఇచ్చారు. ఇత‌ర ఏ సాయం చేయ‌డానికి ముందుకు రాలేదు. దీంతో భార్య‌ మృతదేహాన్ని స్వామి తన భుజాలపై వేసుకుని మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మ‌శాన వాటిక‌కు తీసుకెళ్లాడు. శ్మ‌శాన వాటిక‌లో ఖ‌ర్చుల కోసం భార్య‌ మృతదేహంతోనే మార్గ‌మ‌ధ్యంలో స్వామి భిక్షాటన చేయడం గ‌మ‌నార్హం




More Telugu News