ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పురంధేశ్వరి.. టీఆర్ఎస్‌పై ఆరోపణలు
- కేసీఆర్ పాలనలో పరిస్థితులు ఎలా ఉన్నాయో గుర్తించాలి
- ఖమ్మంలో బినామీ కాంట్రాక్టర్లదే రాజ్యం
- ఓ మంత్రికి ఓటమి భయం పట్టుకుంది
- అందుకే ఆయన భార్యను ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పించారు
తెలంగాణలో వరంగల్, ఖమ్మం మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకురాలు పురంధేశ్వరి ఈ రోజు ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆరేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో పరిస్థితులు ఎలా ఉన్నాయో గుర్తించి ఖమ్మం ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్లు వేయాలని ఆమె చెప్పారు.
ఖమ్మంలో బినామీ కాంట్రాక్టర్లదే రాజ్యమని పురంధేశ్వరి ఆరోపణలు గుప్పించారు. ఓ మంత్రికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే తన భార్యను ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పించారని ఆమె అన్నారు. తన కాలేజీ వ్యాపారాల కోసం సదరు మంత్రి అవినీతికి పాల్పడ్డారని, ఖమ్మం ప్రజలు ఈ ఎన్నికల్లో ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆమె వ్యాఖ్యానించారు.