భారత్‌లో కరోనా పరిస్థితి చూసి నా హృదయం ముక్కలైంది: సత్యనాదెళ్ల
- భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన అమెరికాకు థ్యాంక్స్
- ఆక్సిజన్ పరికరాలను కొనుగోలు చేసేందుకు సాయపడతాం
- భారత్‌కు మా మద్దతు ఉంటుంది
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ఇక్కడి పరిస్థితులపై పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నారు. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కూడా ఈ విషయంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.
భారత్‌లో కరోనా పరిస్థితి చూసి తన హృదయం ముక్కలైందని తెలిపారు. కరోనా వేళ భారత్‌కు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన అమెరికాకు సత్యనాదెళ్ల థ్యాంక్స్ చెప్పారు. ఆక్సిజన్ పరికరాలను కొనుగోలు చేసేందుకు వీలుగా భారత్‌కు ఈ సమయంలో తమ మద్దతు ఉంటుందని తెలిపారు. భారత్ కు సాయం చేసేందుకు తమ కంపెనీ కూడా తమ వనరులను ఉపయోగిస్తుందని చెప్పారు.