ఏపీలో కరోనా మృత్యుఘంటికలు... ఒక్కరోజులో 69 మంది బలి

  • గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో 12 మంది మృతి
  • ఇతర జిల్లాల్లోనూ మృతుల సంఖ్యలో పెరుగుదల
  • 7,685కి పెరిగిన కరోనా మరణాలు
  • పాజిటివ్ కేసుల సంఖ్యలోనూ భారీగా పెరుగుదల
  • ఒక్కరోజులో 12 వేలకు పైగా కొత్త కేసులు
ఏపీలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో ఒక్కరోజులోనే 69 మంది మృత్యువాత పడడం పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తోంది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 12 మంది కరోనాకు బలయ్యారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాల సంఖ్యలో పెరుగుదల నమోదైంది. ఈ క్రమంలో ఇప్పటివరకు కరోనాతో కన్నుమూసిన వారి సంఖ్య 7,685కి పెరిగింది.

గడచిన 24 గంటల్లో ఏపీలో 62,885 కరోనా పరీక్షలు నిర్వహించగా 12,634 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 1,680 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 1628, గుంటూరు జిల్లాలో 1576, నెల్లూరు జిల్లాలో 1258, కర్నూలు జిల్లాలో 1158, అనంతపురం జిల్లాలో 1095 కరోనా కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 4,304 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.

ఏపీలో ఇప్పటివరకు 10,33,560 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 9,36,143 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 89,732కి పెరిగింది.


More Telugu News