సీటీ స్కాన్ ధర రూ.3 వేలకు మించితే కఠినచర్యలు తీసుకుంటాం: ఏపీ ప్రభుత్వం హెచ్చరిక

  • ఏపీలో కరోనా విజృంభణ
  • సీటీ స్కాన్ ధర రూ.3 వేలుగా నిర్ణయించిన సర్కారు
  • ఆసుపత్రులకు, ల్యాబ్ లకు ఉత్తర్వులు జారీ
  • సీటీ స్కాన్ వివరాలు కొవిడ్ డాష్ బోర్డులో నమోదు చేయాలని ఆదేశం
రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సీటీ/హెచ్ఆర్ సీటీ స్కాన్ ధరను రూ.3 వేలుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీటీ స్కాన్ కు తాము నిర్దేశించిన ధరను మించి వసూలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆసుపత్రులకు, ల్యాబ్ లకు స్పష్టం చేసింది.

సీటీ స్కాన్ వివరాలను, కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారి వివరాలను ఏపీ కొవిడ్-19 డాష్ బోర్డులో నమోదు చేయాలని ఆదేశించింది. రోగి పేరు, ఫోన్ నెంబరు, సీటీ/హెచ్ఆర్ సీటీ స్కాన్ ఇమేజి, సీటీ స్కాన్ సైన్డ్ కాపీ వివరాలను డాష్ బోర్డులో నిక్షిప్తం చేయాలని పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని, ఈ ఆదేశాల అమలును జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఓ ప్రకటన చేశారు.


More Telugu News