యంత్రాంగం విఫలమైంది... కాంగ్రెస్ శ్రేణులు రాజకీయాలు వదిలేసి ప్రజాసేవకు ఉపక్రమించాలి: రాహుల్ గాంధీ పిలుపు
- దేశంలో కరోనా స్వైరవిహారం
- ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ
- ప్రజాసేవ ఎంతో ముఖ్యమని వెల్లడి
- ప్రజలకు ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి
- ఇది కాంగ్రెస్ విద్యుక్త ధర్మం అని వ్యాఖ్యలు
దేశంలో కరోనా వైరస్ అడ్డుఅదుపు లేకుండా వ్యాప్తి చెందుతుండడం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం కరోనాపై చేతులెత్తేసిందని, ఈ సమయంలో ప్రజలను ఆదుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయంలో దేశానికి భాధ్యతాయుతమైన పౌరుల అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ సహచరులు అన్ని రాజకీయపరమైన కార్యకలాపాలను వదిలేసి ప్రజాసేవకు ఉపక్రమించాలని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు సంపూర్ణ సహకారం అందిస్తూ వారి బాధను తగ్గించే ప్రయత్నం చేయాలని సూచించారు. ఇది కాంగ్రెస్ కుటుంబ విద్యుక్త ధర్మం అని స్పష్టం చేశారు.