ఒంగోలు రిమ్స్ వద్ద నేలపై కరోనా పేషెంట్లు... ఆసుపత్రి అధికారులకు మంత్రి ఆళ్ల నాని ఫోన్

  • బెడ్లు లేక రోగులు విలవిల అంటూ కథనాలు
  • అధికారులను వివరణ కోరిన ఆరోగ్య శాఖ మంత్రి
  • వారు రోగుల బంధువులని పేర్కొన్న రిమ్స్ సూపరింటిండెంట్
  • ఆసుపత్రిలో పడకలకు కొరతలేదని వెల్లడి
ప్రకాశం జిల్లా ఒంగోలులో రిమ్స్ వద్ద కరోనా పేషెంట్లు బెడ్లు దొరక్క నేలపైనే పడుకుని ఉన్నట్టు మీడియాలో కథనాలు రావడం తెలిసిందే. దీనిపై వెంటనే స్పందించిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకాశం జిల్లా వైద్య శాఖ అధికారులకు ఫోన్ చేశారు. జిల్లా డీఎం అండ్ హెచ్ఓ, రిమ్స్ సూపరింటిండెంట్ లతో మాట్లాడి ఆసుపత్రుల్లో పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఒంగోలు రిమ్స్ లో నేల మీద పడుకున్న వారు కరోనా రోగుల బంధువులని రిమ్స్ సూపరింటిండెంట్ మంత్రికి వివరణ ఇచ్చారు. రిమ్స్ లో 1,126 బెడ్లు ఉన్నాయని, 950 మంది కరోనా రోగులకు చికిత్స జరుగుతోందని తెలిపారు. నాన్ కోవిడ్ పేషెంట్లకు ఇతర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.


More Telugu News