'భారత్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది'.. వీడియో పోస్ట్ చేసిన గ్రేటా థన్‌బర్గ్
- భారత్‌కు ప్రపంచ దేశాలు సాయం చేయాలి
- ఆసుపత్రుల్లో ఆక్సిజన్, బెడ్స్ కొరత
- అనేక మంది రోగులు మరణిస్తున్నారు
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఇక్కడి రోగులు, ప్రజలు ఎదుర్కొంటోన్న ఇబ్బందులపై ప్రపంచ దేశాల ప్రముఖులు స్పందిస్తున్నారు. భారత్‌లో ఆక్సిజన్ కొరత, కరోనా రోగులకు ఆసుపత్రుల్లో బెడ్లు లేకపోవడం వంటి పరిణామాలు విదేశీయులను సైతం కదిలిస్తున్నాయి. భారత్‌లో కరోనా విజృంభణ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై ప్రపంచ పర్యావరణ హక్కుల కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్ కూడా స్పందించారు.
భారత్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోన్న భారత్‌కు ప్రపంచ దేశాలు సహాయం చేయాలని ఆమె కోరారు. భారత్‌లోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్, బెడ్స్ కొరత తీవ్రంగా ఉందని ఆమె గుర్తు చేశారు. ఈ కారణంగా అనేక మంది రోగులు మరణిస్తున్నారని ఆమె చెప్పారు.