వ్యాప్తి ఎక్కువున్న చోట లాక్ డౌన్ పెట్టాల్సిందే: ఎయిమ్స్ చీఫ్ రణ్ దీప్ గులేరియా
- 10 శాతం కేసులుంటే తప్పదని కామెంట్
- కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయని వెల్లడి
- వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన
కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం (చేసిన టెస్టుల్లో 10 శాతం కేసులు) ఉన్న చోట లాక్ డౌన్ పెట్టాల్సిందేనని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా తేల్చి చెప్పారు. కేసులు పెరిగిపోతుండడంతో ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి తీవ్రమవుతోందని ఆయన అన్నారు. ఇప్పుడు మనం చేయాల్సినవి రెండే రెండన్నారు.
ఒకటి యుద్ధప్రాతిపదికన ఆరోగ్య రంగంలో మౌలిక వసతులను పెంచాలన్నారు. పడకలు, ఔషధాలు, ఆక్సిజన్ వంటి వాటిని ప్రోధి చేసి పెట్టుకోవాలన్నారు. రెండోది వీలైనంత త్వరగా మహమ్మారిని నియంత్రించాలన్నారు. యాక్టివ్ కేసులు పెరుగుతూ పోతే పరిస్థితి చెయ్యి దాటిపోతుందని ఆయన హెచ్చరించారు. కేసులు తగ్గాలంటే మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ పెట్టాలన్నారు. కంటెయిన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఫస్ట్ వేవ్ చాలా నెమ్మదిగా ఉందని, కానీ, సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా, వేగంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దానికి తగ్గట్టు మనం సిద్ధం కాలేకపోయామన్నారు. బ్రిటన్ వేరియంట్ తోనే కేసులు భారీగా పెరిగాయన్నారు. మున్ముందు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రెమ్డెసివిర్ అనేది సంజీవని కాదన్నారు. ఆ ఔషధంతో కరోనా మరణాలేమీ తగ్గవన్నారు. రెమ్డెసివిర్ ప్రభావశీలతపై భిన్నమైన సమాచారం అందుబాటులో ఉందని చెప్పారు.