ఢిల్లీలో మరో వారంపాటు లాక్‌డౌన్‌: కేజ్రీవాల్ ప్ర‌క‌ట‌న‌

  • ఢిల్లీలో క‌రోనా కేసుల ఉద్ధృతి నేప‌థ్యంలో నిర్ణ‌యం
  • వ‌చ్చేనెల 3వ తేదీ ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్‌
  • విధించక‌పోతే ప‌రిస్థితులు చేజారిపోతాయ‌ని భావిస్తోన్న స‌ర్కారు
ఢిల్లీలో క‌రోనా కేసుల ఉద్ధృతి విప‌రీతంగా ఉన్న‌ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ వారం రోజుల క్రితం ఆరు రోజుల లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ లాక్‌డౌన్ సోమ‌వారం  ఉద‌యం 6 గంట‌ల‌కు ముగియ‌నుంది. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌ లాక్‌డౌన్‌ పొడిగింపు అవ‌కాశాలేవీ ఉండ‌బోవ‌ని చెప్పిన‌ప్ప‌టికీ.. ఆ ప‌ని చేయ‌క‌త‌ప్పలేదు. మరో వారం రోజులపాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్న‌ట్లు కేజ్రీవాల్ ఈ రోజు ప్రకటించారు.

వ‌చ్చేనెల 3వ తేదీ ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని చెప్పారు. క‌రోనా విజృంభ‌ణ ఉగ్ర‌రూపం దాల్చిన నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ విధించక‌పోతే రానున్న రోజుల్లో ప‌రిస్థితులు మ‌రింత చేజారిపోతాయ‌ని ఢిల్లీ ప్ర‌భుత్వం భావిస్తోంది. ప్ర‌జ‌లు అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తోంది. ఢిల్లీలో ఆక్సిజ‌న్ కొర‌త కూడా నెల‌కొన్న విష‌యం తెలిసిందే.




More Telugu News