టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు చెందిన భ‌వ‌నం కూల్చివేత‌.. విజ‌య‌సాయిరెడ్డిపై ప‌ల్లా ఆరోప‌ణ‌లు

  • నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణం జరిపారంటూ కూల్చివేత‌
  • నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని ఎలా కూల్చుతార‌ని ప‌ల్లా ప్ర‌శ్న‌
  • వైసీపీలో చేరాల‌ని విజయసాయి రెడ్డి ఆహ్వానించారని వ్యాఖ్య‌
  • వైసీపీలోకి చేరనందుకే త‌న‌ భవనాన్ని కూల్చివేశారని ఆరోప‌ణ
నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణం జరిపారంటూ జీవీఎంసీ అధికారులు గ‌త రాత్రి .. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‎ కు చెందిన బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాన్ని కూల్చివేశారు. నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని ఎలా కూల్చుతార‌ని జీవీఎంసీ సిబ్బందిని ప‌ల్లా ప్రశ్నించారు. దీంతో రోడ్డుకు సెట్ బ్యాక్ వదలలేదని, అందుకే కూల్చివేశామని అధికారులు తెలిపారు. అక్క‌డ‌ ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీయకుండా పోలీసులు మోహరించారు.

ఈ ఘ‌ట‌న‌పై ప‌ల్లా మీడియాతో మాట్లాడుతూ... త‌న భ‌వ‌నాన్ని కూల్చడానికి కారణం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డేన‌ని చెప్పారు. ఆ పార్టీలో చేరాల‌ని విజయసాయి రెడ్డి త‌న‌ను ఆహ్వానించారని, తాను వైసీపీలోకి చేరనందుకే త‌న‌ భవనాన్ని కూల్చివేశారని ఆరోపించారు.

త‌న‌పై కక్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్పడ్డారని తెలిపారు. త‌న‌ భవనాన్ని కూల్చి విజయసాయిరెడ్డి రాక్ష‌సానందం పొందుతున్నార‌ని ఆయ‌న చెప్పారు. తాము అనుమతులు తీసుకునే భవన నిర్మాణం చేపట్టామ‌ని, అక్రమాలకు, ఉల్లంఘనలకు పాల్పడలేదని అన్నారు.



More Telugu News