కారులో న్యూడ్ వీడియోలు తీశాడు... తమిళ అసిస్టెంట్ డైరెక్టర్ పై నటి ఫిర్యాదు!
- భర్తతో విడిపోయిన జెన్నిఫర్
- ఆపై సహాయ దర్శకుడితో సహజీవనం
- డబ్బు కోసం వేధిస్తున్న నవీన్ కుమార్
ఓ కారులో తన నగ్న వీడియోలు తీసిన టీవీ సీరియల్ సహాయ దర్శకుడు నవీన్ కుమార్, వాటిని చూపించి, ఖర్చుల కోసం డబ్బు డిమాండ్ చేస్తున్నాడని తమిళ బుల్లితెర నటి జెన్నిఫర్, చెన్నై పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో, కేసును పోలీసులు విచారిస్తున్నారు. జెన్నిఫర్ వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, మనాలీ సమీపంలో తన కుటుంబీకులతో నివసిస్తున్న జెన్నిఫర్, గత ఐదేళ్లుగా టీవీ సీరియల్స్ లో నటిస్తోంది. ఆమెకు 2019, ఆగస్టు 25న శరవణన్ అనే వ్యక్తితో వివాహం కాగా, ఆపై మనస్పర్థలతో విడిపోయారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టు పరిధిలో ఉంది.
ఈ క్రమంలో టీవీలకు కావాల్సిన సీరియల్స్ కు సహాయ దర్శకుడిగా పని చేస్తున్న నవీన్ కుమార్ దగ్గరయ్యాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్యా సహజీవనం కొనసాగింది. లాక్ డౌన్ కారణంగా నవీన్ కుమార్ కు పని పోవడంతో, డబ్బు కోసం జెన్నిఫర్ ను ఆశ్రయించాడు. అతని వేధింపులను జెన్నిఫర్ తట్టుకోలేకపోయింది. ఇటీవలి కాలంలో ఆమె షూటింగ్ లో ఉండగా, అక్కడికి వచ్చిన నవీన్, ఆమెను బయటకు తీసుకెళ్లి, కారులో కూర్చోబెట్టి, న్యూడ్ వీడియోలు తీశాడు.
ఆపై బెదిరింపులకు దిగడంతో, విషయాన్ని అతని తల్లికి చెప్పింది. ఆమె ఏ మాత్రం పట్టించుకోకపోగా, తన కుమారుడు చెప్పినట్టుగా నడచుకోవాలని బెదిరించింది. దీంతో ఏం చేయాలో తోచని ఆమె, పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను బెదిరిస్తున్నాడని, దౌర్జన్యం చేస్తున్నాడని, అతనిపైనా, ఆయన తల్లిదండ్రులపైనా చర్యలు తీసుకోవాలని కోరింది.