ఒడిశా నుంచి పలు రాష్ట్రాలకు బయలుదేరిన ఆక్సిజన్ ట్రక్కులు
- 200 టన్నుల ఆక్సిజన్‌తో బయలుదేరిన ట్రక్కులు
- హైదరాబాద్, విశాఖపట్టణానికి కూడా ఆక్సిజన్
- ట్రక్కులు సాఫీగా సాగేందుకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు
ఒడిశాలో ఆక్సిజన్ నింపుకున్న పలు ట్రక్కులు ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు బయలుదేరాయి. కరోనా బాధిత రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హామీ ఇచ్చిన తర్వాతి రోజే 200 టన్నుల ఆక్సిజన్‌ను వివిధ రాష్ట్రాలకు పంపించారు.
ఇప్పటికే పలు ట్యాంకర్లు విశాఖపట్టణం, హైదరాబాద్, ఇండోర్, పూణె, ముంబై, నాగ్‌పూర్ తదితర రాష్ట్రాలకు బయలుదేరాయి. మరికొన్ని రాష్ట్రాలకు కూడా ట్యాంకర్లు బయలుదేరనున్నట్టు అధికారులు తెలిపారు. ఆక్సిజన్‌ను తరలించే క్రమంలో ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా ఒడిశా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. ట్రక్కులు సాఫీగా ముందుకు సాగేందుకు ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేశారు.