భారత్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రయాణ ఆంక్షలు విధించిన ఇరాన్, కువైట్!
- భారత ప్రయాణికులపై వివిధ దేశాల ఆంక్షలు
- కొవిడ్ ఉద్ధృతే కారణం
- శనివారం నుంచి అమల్లోకి కువైట్ నిషేధం
- సరకు రవాణా విమాన రాకపోకలు యథాతథం
- భారత వేరియంట్ అత్యంత ప్రమాదకరమైందన్న ఇరాన్
కరోనా కేసులు రోజురోజుకీ భారీ స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు భారత ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కువైట్, ఇరాన్ చేరాయి. ఇప్పటికే బ్రిటన్, యూఏఈ, కెనడా, హాంకాంగ్, న్యూజిలాండ్, అమెరికా.. భారత ప్రయాణికులపై పలు రకాల ప్రయాణ ఆంక్షలు విధించాయి.
భారత్ నుంచి ప్రయాణికుల విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు కువైట్ ప్రకటించింది. భారత్ నుంచి నేరుగా లేదా ఇతర దేశాల మీదుగా తమ దేశంలోకి ప్రయాణికుల రాకపై శనివారం నుంచి నిషేధం విధిస్తున్నట్లు కువైట్ విమానయాన శాఖ వెల్లడించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, సరకు రవాణా విమాన రాకపోకలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. ఇరాన్, భారత్‌తో పాటు పాకిస్థాన్ నుంచి కూడా విమాన రాకపోకల్ని కువైట్ నిలిపివేసింది.
మరోవైపు ఇరాన్ సైతం భారత్, పాకిస్థాన్ నుంచి విమానాలపై నిషేధం విధించింది. అక్కడి ఆరోగ్య శాఖ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. భారత వేరియంట్ అత్యంత ప్రమాదకరమైందని అభిప్రాయపడింది.