వ్యాక్సిన్ ఆర్డర్ ఇస్తూ.. భారత్ బయోటెక్, సీరం సంస్థలకు ఏపీ ప్రభుత్వం లేఖ
- రాష్ట్రానికి మరిన్ని టీకా డోసుల కోసం ప్రభుత్వం చర్యలు
- ఏపీకి 4.08 కోట్ల డోసులు కావాలని విజ్ఞప్తి
- 2.4 కోట్ల మందికి రెండేసి డోసులు ఇవ్వాలని వెల్లడి
- కేంద్రం నిర్దేశించిన ధరకే విక్రయించాలని లేఖలో స్పష్టీకరణ
కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ఆశాకిరణంలా కనిపిస్తోంది. అందుకే ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి మరిన్ని టీకా డోసులు తీసుకువచ్చే చర్యలు ముమ్మరం చేసింది. వ్యాక్సిన్ ఉత్పత్తిదారులైన భారత్ బయోటెక్, సీరం ఇన్ స్టిట్యూట్ అధినేతలతో సీఎం జగన్ ఇప్పటికే ఫోన్ లో మాట్లాడగా, తాజాగా ఏపీ ప్రభుత్వం ఆ రెండు సంస్థలకు లేఖ రాసింది.
భారత్ బయోటెక్, సీరం సంస్థలు రాష్ట్రానికి చెరో 4.08 కోట్ల వ్యాక్సిన్ డోసులు సరఫరా చేయాలని లేఖలో కోరింది. 2.4 కోట్ల మందికి రెండేసి డోసుల చొప్పున రాష్ట్రానికి విక్రయించాలని సూచించింది. అయితే కేంద్రం నిర్దేశించిన ధరకే వ్యాక్సిన్ సరఫరా చేయాలని ఏపీ సర్కారు స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్ డోసుల బిల్లును త్వరగానే చెల్లిస్తామని తన లేఖలో పేర్కొంది.