భారత్ కు సింగపూర్ బాసట... 4 క్రయోజనిక్ కంటైనర్లలో ఆక్సిజన్

  • భారత్ లో కరోనా కేసుల సునామీ
  • ఆక్సిజన్ దొరక్క అల్లాడుతున్న కరోనా రోగులు
  • భారత్ కు అండగా వుంటామన్న సింగపూర్ 
  • కంటైనర్లతో బయల్దేరిన విమానం
భారత్ లో కొవిడ్ మహమ్మారి మహోగ్రరూపం ప్రదర్శిస్తున్న వేళ, ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో అందుబాటులోని అన్ని ఆక్సిజన్ వనరులను ఉపయోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో భారత్ కు సింగపూర్ ప్రభుత్వం బాసటగా నిలిచింది. కొవిడ్-19పై పోరాటంలో భారత్ కు తాము అండగా ఉంటామని సింగపూర్ పేర్కొంది. అంతేకాదు, 4 క్రయోజనిక్ ట్యాంకర్ల నిండా ఆక్సిజన్ ను భారత్ కు పంపి తన సహృదయతను చాటుకుంది. ఈ క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లతో భారత వాయుసేన కార్గో విమానం సింగపూర్ లోని చాంగీ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరింది.


More Telugu News