మనుషుల ప్రాణాలు పోతుంటే రాజకీయాలు అవసరం లేదు: కేసీఆర్‌ కుటుంబంపై కిష‌న్ రెడ్డి ఆగ్ర‌హం

  • కేసీఆర్‌ కుటుంబం కేంద్ర స‌ర్కారుపై అనవసర ఆరోపణలు చేస్తోంది
  • రాష్ట్రంలో క‌రోనా లెక్క‌ల‌ ప్ర‌కార‌మే కేంద్ర స‌ర్కారు వ్యాక్సిన్, ఆక్సిజన్ సరఫరా
  • మూడు రోజుల్లో రాష్ట్రానికి మరింత ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ సరఫరా 
క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో మనుషుల ప్రాణాలు పోతుంటే రాజకీయాలు అవసరం లేదని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కుటుంబం కేంద్ర స‌ర్కారుపై అనవసర ఆరోపణలు చేస్తోందని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ రోజు ఆయ‌న హైద‌రాబాద్‌లో ప‌లు క‌రోనా ఆసుప‌త్రుల‌ను సంద‌ర్శించి మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ‌పై కేంద్ర ప్ర‌భుత్వం వివక్ష చూపట్లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో న‌మోద‌వుతోన్న‌ కేసులు, మరణాల లెక్క‌ల ప్ర‌కార‌మే రాష్ట్రానికి కేంద్ర స‌ర్కారు వ్యాక్సిన్, ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోందని తెలిపారు. అలాగే, మూడు రోజుల్లో రాష్ట్రానికి మరింత ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ సరఫరా అవుతుందని వివ‌రించారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుప‌త్రిలో ఆక్సిజన్‌ ఉత్పత్తికి 2 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఆక్సిజన్‌ కొరతను తీర్చేందుకు 24 గంటలు (మూడు షిఫ్టుల్లో) కేంద్ర ప్ర‌భుత్వం ఉత్పత్తిని ప్రారంభించిందని తెలిపారు.


More Telugu News