మేం సేకరించే వ్యాక్సిన్లను ఉచితంగానే ఇస్తాం: కేంద్ర ప్రభుత్వం
- రూ.150కే వ్యాక్సిన్ కొంటాం
- స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
- ఇటీవలే వ్యాక్సిన్ రేట్లపై పలు పార్టీల అభ్యంతరాలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాక్సిన్ల పాలసీపై పలు పార్టీల నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోన్న ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ కొవిషీల్డ్ విక్రయం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు ధరలు నిర్ణయించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తో పాటు పలువురు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
కేంద్ర సర్కారుకి ఒక డోసును రూ.150కి అమ్మి, రాష్ట్రాలకు మాత్రం రూ.400 విక్రయించడమేంటని వారు ప్రశ్నించారు. ఈ తీరు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఉచిత వ్యాక్సిన్‌పై కేంద్ర సర్కారు వెనకడుగు వేసిందని కాంగ్రెస్ నేత చిదంబరం కూడా నిన్న అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో తాము సేకరించే వ్యాక్సిన్లను ఉచితంగానే రాష్ట్రాలకు పంపిణీ చేస్తామని కేంద్ర సర్కారు తాజాగా కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వ్యాక్సిన్ ధర రూ.150 మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. ఆ ధరకే కొనుగోలు జరిపి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉచితంగా అందిస్తామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. అయితే, రాష్ట్రాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు ఆయా వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు విక్రయించే ధరల విషయంలో మాత్రం కేంద్రం వివరణ ఇవ్వలేదు.