హెరిటేజ్ తో కుమ్మక్కై 'సంగం' భంగం: విజయసాయిరెడ్డి
- రైతులకు చెందాల్సిన లాభాలు 'దూళి' పాలు
- అరెస్టుపై పచ్చమీడియా గగ్గోలుపెట్టి అక్రమాలపై మౌనమేల?
- అవినీతి జరిగిన చోట ఏసీబీ దాడులు చేస్తే ఉలికిపాటెందుకు?
- భూముల్ని అప్పనంగా కొట్టేస్తే చట్టం ఊరుకుంటుందా?
టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'రైతులకు చెందాల్సిన లాభాలు 'దూళి' పాలు. హెరిటేజ్ తో కుమ్మక్కై "సంగం" భంగం. అరెస్టుపై పచ్చమీడియా గగ్గోలుపెట్టి అక్రమాలపై మౌనమేల? అవినీతి జరిగిన చోట ఏసీబీ దాడులు చేస్తే ఉలికిపాటెందుకు? పాడి రైతులు పైసా పైసా పోగేసి కొన్న డెయిరీ భూముల్ని అప్పనంగా కొట్టేస్తే చట్టం ఊరుకుంటుందా?' అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
'అవినీతి-అక్రమాల్లో దేవినేని, కొల్లు, ధూళిపాళ్లకు అచ్చెన్నే ఆదర్శమా? లేకపోతే వాళ్లే అచ్చెన్నకు ఆదర్శమా? అచ్చెన్నలాగే వీళ్లుకూడా పార్టీ లేదు బొక్కా లేదంటారా? టీడీపీ మూసేస్తారని తెలిసి ముందే చక్కబెట్టేసుకుందామనుకున్నారా?' అని విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా ప్రశ్నించారు.