మౌంట్ ఎవరెస్టునూ వదలని కరోనా.. పర్వతారోహకుడికి సోకిన వైరస్

  • బాధితుడిని హెలికాప్టర్‌లో నేపాల్‌కు తరలించిన అధికారులు 
  • బేస్‌క్యాంపులో వందలాదిమంది ఉండడంతో ఆందోళన
  • కోలుకుంటున్న బాధితుడు
ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని అల్లాడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్‌పైనా తిష్ట వేసింది. అక్కడ ఓ బేస్ క్యాంపులో ఉన్న ఓ పర్వతారోహకుడు కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. బాధితుడిని వెంటనే హెలికాప్టర్ ద్వారా ఖఠ్మాండూలోని ఆసుపత్రికి తరలించారు.

తనకు కరోనా సోకిన విషయాన్ని నెస్ అనే బాధిత పర్వతారోహకుడు మీడియాకు తెలిపాడు. ప్రస్తుతం తాను కోలుకున్నానని, నేపాల్‌లో ఉన్నానని వివరించాడు. మరోవైపు, బేస్ క్యాంపులో వందలాదిమంది పర్వతారోహకులు, గైడ్‌లు, సహాయకులు ఉండడంతో వారంతా కొవిడ్ బారినపడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఆస్ట్రేలియాకు చెందిన గైడ్ లుకాస్ ఫర్న్‌బేష్ హెచ్చరించారు.


More Telugu News