ఆక్సిజన్ ట్యాంకర్ అదృశ్యం.. కేసు నమోదు చేసిన పోలీసులు!
- హర్యానాలో పానిపట్ నుంచి బయలుదేరిన ట్యాంకర్
- మార్గమధ్యంలోనే కనిపించకుండా పోయిన ట్యాంకర్
- బుధవారమే బయలుదేరిన వాహనం
- గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు
ఓవైపు దేశమంతా ఆక్సిజన్ కొరతతో ఆందోళన చెందుతుంటే.. మరోవైపు హర్యానాలో ఆక్సిజన్ సరఫరా చేస్తున్న ట్యాంకర్ అదృశ్యం కావడం కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. హర్యానాలోని పానిపట్ నుంచి సిర్సాకు ఆక్సిజన్ లోడుతో ఓ ట్యాంకర్ బయలుదేరింది. మార్గమధ్యంలోనే అది అదృశ్యమైపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
పానిపట్ జిల్లా డ్రగ్ కంట్రోలర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బుధవారం పానిపట్ ప్లాంట్‌లో లిక్విడ్ ఆక్సిజన్ నింపుకొన్న ట్రక్కు సిర్సాకు బయల్దేరి వెళ్లింది. అయితే, ఆ వాహనం గమ్యస్థానానికి చేరకపోవడంతో సంబంధిత అధికారులు పోలీసులకు సమాచారం అందజేశారు. కేసులు నమోదు చేసిన వారు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగి మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ పుంజుకున్న తరుణంలో ఆక్సిజన్ ట్యాంకర్ అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది.