ఆ ఐదు రాష్ట్రాల విమాన ప్రయాణికులకు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసిన పశ్చిమ బెంగాల్
- కరోనా ఉద్ధృతి నేపథ్యంలోనే నిర్ణయం
- జాబితాలో ఢిల్లీ, యూపీ, ఎంపీ, గుజరాత్, ఛత్తీస్గఢ్
- పౌరవిమానయాన శాఖకు లేఖ రాసిన బెంగాల్
- ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తెలంగాణకు అమల్లో ఉన్న నిబంధన
దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీ సహా మొత్తం ఐదు రాష్ట్రాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు అక్కడి సర్కార్ కొవిడ్-నెగెటివ్ సర్టిఫికెట్ను తప్పనిసరి చేసింది. 72 గంటల ముందు జారీ చేసిన ధ్రువపత్రాల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఏప్రిల్ 26 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఈ మేరకు బెంగాల్ ప్రభుత్వం పౌరవిమానయాన శాఖకు లేఖ రాసింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్ నుంచి వచ్చే ప్రయాణికులకు నెగెటివ్ ఆర్టీ-పీసీఆర్ సర్టిఫికెట్ తప్పసరిగా చూపించాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు అమల్లో ఉంది. పైన పేర్కొన్న రాష్ట్రాల్లో కరోనా భారీ స్థాయిలో విజృంభిస్తోంది.
మరోవైపు పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరో రెండు విడతల పోలింగ్ మిగిలి ఉంది. ఈ తరుణంలో అక్కడి సర్కార్ కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ను తప్పనిసరి చేయడం గమనార్హం.