ఢిల్లీలో ప్రబల రూపంగా యూకే వేరియంట్!
- దేశరాజధానిలో 3,208 నమూనాలకు జన్యుక్రమ విశ్లేషణ
- యూకే వేరియంట్‌కు సంబంధించిన 400 కేసుల గుర్తింపు
- దేశవ్యాప్తంగా 11 శాతం ఆందోళనకర రకాలు
- తెలంగాణలో 170 యూకే, 57 దక్షిణాఫ్రికా వేరియంట్ కేసులు
దేశ రాజధానిలో కరోనా పాజిటివ్ కేసుల నమూనాల విశ్లేషణలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో యూకే వేరియంట్ ప్రబల రూపంగా మారుతోందని ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ)’ వెల్లడించింది. మొత్తం 3,208 నమూనాలకు జన్యుక్రమ విశ్లేషణ జరపగా.. యూకే వేరియంట్‌కు సంబంధించినవి 400 కేసులు, 76 ఇండియన్ డబుల్ మ్యూటెంట్ కేసులు, 23 దక్షిణాఫ్రికా కేసులను గుర్తించినట్లు తెలిపింది. అలాగే దేశవ్యాప్తంగా 11 శాతం ఆందోళనకర రకాలు ఉన్నట్లు పేర్కొంది.
దేశంలో మొత్తం 1,644 యూకే వేరియంట్ కేసులు, 112 దక్షిణాఫ్రికా వేరియంట్ కేసులు, 732 బ్రెజిల్ వేరియంట్ కేసులను గుర్తించారు. ఢిల్లీలో యూకే వేరియంట్ కేసులు మార్చి నెలలో రెట్టింపయ్యాయి. 15,135 నమూనాల జన్యుక్రమ విశ్లేషణ ద్వారా దేశవ్యాప్తంగా కరోనా కేసుల విజృంభణ.. కొవిడ్ రకాల మధ్య సంబంధాన్ని నెలకొల్పారు. మొత్తం 1,735 నమూనాల్లో ఇతర వేరియంట్లను గుర్తించారు.
మహారాష్ట్రలో 1,770 నమూనాల్ని విశ్లేషించగా.. 64 యూకే వేరియంట్లు, , ఆరు దక్షిణాఫ్రికా వేరియంట్లు, ఒక బ్రెజిల్ వేరియంట్, 427 ఇండియన్ డబుల్ మ్యూటెంట్ కేసులు ఉన్నట్లు తేలింది. ఇక తెలంగాణలో 170 యూకే వేరియంట్, 57 దక్షిణాఫ్రికా వేరియంట్, మూడు డబుల్ మ్యూటెంట్ కేసులు ఉన్నట్లు గుర్తించారు.