భారత్‌లో కరోనా ఉగ్రరూపంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ స్పందన!
- భారత ప్రజలకు సంఘీభావం
- కరోనా ఎవ్వరినీ వదలట్లేదు
- మా తరఫున సాయం చేసేందుకు మేము సిద్ధం
భారత్‌లో రోజుకి మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతుండడంతో దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మేక్రాన్ దీనిపై స్పందించారు.
'భారత్‌లో కొవిడ్-19 ఉద్ధృతి వల్ల సమస్యలు ఎదుర్కొంటోన్న భారత ప్రజలకు నేను సంఘీభావం తెలుపుతున్నాను. కరోనా ఎవ్వరినీ వదలట్లేదు.. దానిపై పోరాటంలో ఫ్రాన్స్ కూడా మీకు అండగా ఉంటుంది. మా తరఫున సాయం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం' అని ఆయన ప్రకటన చేశారు. కాగా, ఫ్రాన్స్ కూడా కరోనా ఉద్ధృతితో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మేక్రాన్ కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు.