పూజారికి కరోనా.. ఆసుపత్రిలో బెడ్ ఇప్పించి ఉదారత చాటుకున్న అసదుద్దీన్
- హోం ఐసోలేషన్‌లో ఆలయ పూజారి
- పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలింపు
- బెడ్స్ లేకపోవడంతో నిస్సహాయత
- శాలిబండలోని ఆసుపత్రిలో బెడ్ ఇప్పించిన అసద్
హైదరాబాద్ పాతబస్తీలోని ఓ ఆలయ పూజారి కరోనా బారినపడగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఉదారత చాటుకున్నారు. 75 ఏళ్ల పూజారి గత శనివారం కరోనా బారినపడ్డారు. అప్పటి నుంచి ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో నిన్న కొంత అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించే ప్రయత్నం చేశారు.
అయితే, ఎక్కడా బెడ్స్ అందుబాటులో లేకపోవడంతో వారిలో ఆందోళన మరింత పెరిగింది. ఈ క్రమంలో స్థానిక మజ్లిస్ నేత సాయంతో అసదుద్దీన్ కు పరిస్థితి వివరించారు. స్పందించిన అసద్ శాలిబండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి పూజారికి బెడ్ ఇప్పించి ఉదారత చాటుకున్నారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.