డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ డెలివరీపై అధ్యయనం చేయనున్న ఐసీఎంఆర్
- అనుమతి నిచ్చిన పౌర విమానయాన శాఖ
- ఐఐటీ కాన్పూర్‌తో కలిసి అధ్యయనం
- ఏడాది పాటు అమల్లో ఉండనున్న ఉత్తర్వులు
డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్లను అందజేసే విధానంపై అధ్యయనం చేసేందుకు పౌర విమానయాన శాఖ ఐసీఎంఆర్‌కు అనుమతి నిచ్చింది. ఐఐటీ కాన్పూర్‌తో కలిసి ఐసీఎంఆర్ ఈ అధ్యయనం జరపనుంది. ‘అన్‌మ్యాన్‌డ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టం(యూఏఎస్) నిబంధనలు, 2021’ నుంచి షరతులతో కూడిన మినహాయింపునిస్తూ ఈ అనుమతిని జారీ చేశామని కేంద్రం తెలిపింది. ఈ అనుమతులు ఏడాది పాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అమల్లో వుంటాయి. వ్యాక్సిన్లను డ్రోన్ల ద్వారా సరఫరా చేయడం సాధ్యం అవుతుందా? లేదా? అన్న విషయాన్ని ఈ అధ్యయనంతో తేల్చనున్నారు.