దుబాయ్-భారత్ మధ్య విమాన సేవలు రద్దు!
- ప్రకటించిన ఎమిరేట్స్
- కరోనా ఉద్ధృతి నేపథ్యంలోనే
- పది రోజుల పాటు కొనసాగనున్న నిషేధం
- భారత ప్రయాణికులపై పలు దేశాల ఆంక్షలు
భారత్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్థ ఎమిరేట్స్ అప్రమత్తమైంది. దుబాయ్-భారత్ మధ్య విమాన సేవలను ఈ నెల 25వ తేదీ నుంచి పది రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు భారత ప్రయాణికులపై బ్రిటన్, న్యూజిలాండ్, హాంకాంగ్, అమెరికా, ఫ్రాన్స్ ఆంక్షలు విధించాయి.
భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఫ్రాన్స్ 10 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసింది. భారత్‌ను బ్రిటన్ రెడ్ లిస్ట్‌లో పెట్టింది. భారత్‌కు వెళ్లే యోచనను విరమించుకోవాలని అమెరికా తమ పౌరులను ఆదేశించింది. ఇక హాంకాంగ్, న్యూజిలాండ్ భారత విమానాలను రద్దు చేశాయి.